Kodali Nani: చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అవుతున్నారు: కొడాలి నాని

Kodali Nani says TDP Chandrababu Naidu is the reason for Guntur stampede incident
  • యమ రథంతో చంపుతున్నారని మండిపడ్డ నాని
  • కానుకలిస్తామని పిలిచి ముగ్గురిని బలితీసుకున్నారని ఆరోపణ
  • చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్  
గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోవడానికి కారణం చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. ఏడాది చివర్లో ఎనిమిది మంది, కొత్త ఏడాది ప్రారంభంలో ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాడని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనిగ్రహాన్ని మించిన దశమగ్రహమంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. యమరథంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

కానుకలిస్తామని పిలిచి ముగ్గురిని బలితీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఇలాంటి కార్యక్రమానికి బుద్ధున్న వాళ్లు ఎవరూ వెళ్లరని కొడాలి నాని చెప్పారు. టీడీపీ నేతలు తమ నేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని గగ్గోలు పెడతారన్నారు. 

కాగా, ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం శూన్యమని ఈ సందర్భంగా నాని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అంశాల వారీగానే జాతీయ పార్టీలకు మద్దతిస్తాం తప్ప ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని కొడాలి నాని తేల్చిచెప్పారు.
Kodali Nani
kandukuru stampade
deaths
tdp
Chandrababu
chandranna kanuka

More Telugu News