2023: కొత్త సంవత్సరం కదా.. ఈ ఐదూ చేసేద్దాం గురూ!

  • హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ ఉండాలి
  • పోషకాహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి
  • స్వచ్ఛమైన నీరు తాగడం అవసరం
  • రోజువారీ వ్యాయామం చేయాలి
5 top New Year health wise resolutions for 2023 everyone should take

2023లోకి ప్రవేశించాం. మన జీవితంలో విలువైన ఒక సంవత్సరం (2022) కరిగిపోగా, మన ముందు ఎంతో విలువైన కాలం మిగిలి ఉంది. కరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల మరింత సమయం వృథా తప్ప ఫలితం ఉండదు. అందుకే ఈ ఏడాది అలా వృథా కాకుండా ఆరోగ్యం కోసం ఈ ఐదూ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు చూడొచ్చు. 

హెల్త్ ఇన్సూరెన్స్
ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే తీసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్య సమస్యలు సాధారణమే. కానీ, వీటి కారణంగా ఆర్థిక సమస్యలు రాకూడదని అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. చాలా మంది (పరిమిత ఆదాయ వనరులు ఉన్నవారు) ప్రీమియం ఎక్కువ ఉందని చెప్పి దీన్ని తీసుకోకుండా ఉంటారు. కానీ, ఇది తప్పు.

పోషకాహారం
ఆహారం అన్నది మనిషి ఆరోగ్యాన్నే కాదు, ఆయుష్షును కూడా నిర్ణయించే శక్తితో ఉంటుంది. ఈ ఏడాది ఆరోగ్యకరమైన ఆహారానికే చోటు అంటూ ఓ నిర్ణయం తీసుకోండి. రుచి కోసం ఏది పడితే అది తినేస్తే అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

స్వచ్ఛమైన నీరు
ఆరోగ్యం విషయంలో నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వచ్ఛమైన నీటిని, అది కూడా సరిపడా పరిమాణంలో రోజూ తాగడం ఎంతో మంచిది. దీనివల్ల జీవక్రియలు సమర్థవంతంగా జరుగుతాయి. నీటి కారణంగా వచ్చే వ్యాధులను అరికట్టొచ్చు. 

పరిశుభ్రత
ఆరోగ్యకరమైన జీవనం గడపాలి. కరోనా సరైన పరిశుభ్రత అవసరాన్ని గుర్తు చేసింది. దీన్ని తప్పకుండా కొనసాగించాలి.

వ్యాయామం
నేటి జీవన శైలి వ్యాధులు చాలా వాటికి వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, చెడు ఆహార నియమాలు కారణం. రోజువారీ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు సులభంగా పంపించొచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.  

  • Loading...

More Telugu News