గుంటూరు మృతులకు రూ.20 లక్షల సాయం ప్రకటించిన ఉయ్యూరు ఫౌండేషన్
- గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ
- కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉయ్యూరు ఫౌండేషన్
- పంపిణీ సందర్భంగా తొక్కిసలాట
- ముగ్గురు మహిళల మృతి
ఈ నేపథ్యంలో, ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని వెల్లడించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశారు.