Twitter: ట్విట్టర్ హెడ్డాఫీసు అద్దె కట్టట్లేదట.. కంపెనీపై శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేసిన యజమాని

Twitter Sued For Failing To Pay Rent Of San Francisco Office
  • అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ ప్రధాన కార్యాలయం
  • 1.36 లక్షల డాలర్లు అద్దె బకాయి పడిందంటున్న ఓనర్
  • వివిధ దేశాల్లోని ఆఫీసులకు రెంట్ చెల్లించడంలేదని ఆరోపణలు
ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ ను చిక్కులు వీడట్లేదు. ఒక వివాదం ముగిసేలోపే మరొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా.. ఆఫీసు అద్దె కట్టట్లేదంటూ ఆ కంపెనీపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కొలంబియా రెయిత్ కంపెనీ ట్విట్టర్ పై కోర్టు కెక్కింది. ట్విట్టర్ కంపెనీ 1.36 లక్షల డాలర్ల అద్దె బకాయిపడిందని ఆరోపిస్తోంది. ట్విట్టర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలోని హార్ట్ ఫోర్డ్ బిల్డింగ్ లో 30 వ అంతస్థులో ఉంది. ఈ బిల్డింగ్ సొంతదారు కొలంబియా రెయిత్ నుంచి ట్విట్టర్ అద్దెకు తీసుకుంది.

అయితే, ఇటీవల కొన్ని వారాల నుంచి ట్విట్టర్ అద్దె చెల్లించట్లేదని కొలంబియా రెయిత్ ఆరోపించింది. దీనిపై గత నెల 16న ట్విట్టర్ కు నోటీసులు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. అయినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ట్విట్టర్ పై కోర్టులో దావా వేసినట్లు ఓ ప్రకటనలో వివరించింది. కాగా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన అద్దె కూడా ట్విట్టర్ చెల్లించడంలేదని సమాచారం. దీనిపై పలు మీడియా సంస్థలు ట్విట్టర్ ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆ కంపెనీ స్పందించలేదు.
Twitter
headoffice
office rent
twitter rent dues
san francisco

More Telugu News