Vijayawada: విజయవాడలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసు శాఖ ఆంక్షలు

  • మరి కొన్ని గంటల్లో నూతన సంవత్సరాది
  • వేడుకలకు సిద్ధమవుతున్న ప్రజలు
  • విజయవాడ నగరంలో ఆంక్షలు ఉన్నాయన్న పోలీసు శాఖ
  • వివరాలు తెలిపిన సీపీ కాంతిరాణా టాటా
Police dept imposes restrictions on new year celebrations in Vijayawada

మరికొన్ని గంటల్లో 2022 సంవత్సరం ముగిసి 2023 ఆగమనం చేయనుంది. ఈ నేపథ్యంలో, విజయవాడలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ప్రకటన మేరకు... బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేక్ లు కట్ చేస్తూ హంగామా చేయడం కుదరదు. 

బార్ అండ్ రెస్టారెంట్లు అనుమతి ఇచ్చిన సమయానికి మించి తెరిచి ఉంచకూడదు. డీజేలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజర్లు, క్లబ్ లు, పబ్ ల నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలి. అర్ధరాత్రి 12 గంటల వరకు వేడుకలు నిర్వహించిన తర్వాత, ప్రజలు ఒంటిగంట కల్లా ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. 

అనుమతించిన సమయం ముగిసిన తర్వాత నగరంలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలు చేయనున్నారు. ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. రాత్రుళ్లు ప్రజలు రోడ్లపై తిరగకూడదు. కరోనా నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ కాంతిరాణా టాటా స్పష్టం చేశారు.

More Telugu News