Narendra Modi: రిషబ్ పంత్ కోసం ప్రార్థిస్తున్నా: ప్రధాని మోదీ

PM Modi tweeted he prays for injured Rishabh Pant
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్
  • ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతుండగా ఘటన
  • రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న కారు
  • పంత్ ను బయటి లాగిన బస్ డ్రైవర్
  • ఈ ఘటన తనను కలచివేసిందన్న ప్రధాని మోదీ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ఈ వేకువజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న వార్త క్రీడాలోకాన్ని కుదిపేసింది. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లే క్రమంలో పంత్ నడుపుతున్న లగ్జరీ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. ఓ బస్ డ్రైవర్ వెంటనే స్పందించి పంత్ ను కారు నుంచి బయటికి తీసుకువచ్చాడు. 

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఓవైపు మాతృమూర్తి మరణం తాలూకు విషాదంలో ఉన్నప్పటికీ, పంత్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడన్న వార్త ఆయనను కలచివేసింది. ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురికావడం తనను విచారానికి గురిచేసిందని మోదీ ట్వీట్ చేశారు. పంత్ క్షేమంగా ఉండాలని, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
Narendra Modi
Rishabh Pant
Road Accident
Team India

More Telugu News