Narendra Modi: తల్లి పాడె మోసి, చితికి నిప్పంటించిన మోదీ.. వీడియోలు ఇవిగో

Modi mother funerals ended
  • గాంధీనగర్ లో హీరాబెన్ అంత్యక్రియలు
  • అంతిమ కార్యక్రమానికి హాజరైన కుటుంబ సభ్యులు
  • మహిమాన్వితమైన ఒక శతకం భగవంతుడి పాదాల చెంతకు చేరిందని మోదీ భావోద్వేగం
ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియలు గుజరాత్ లోని గాంధీనగర్ లో ముగిశాయి. వందేళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. ప్రధాని మోదీ ఆమె పాడెను మోశారు. అనంతరం తన తల్లి చితికి నిప్పంటించారు. అంతిమ కార్యక్రమాలకు మోదీ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. 

మరోవైపు తన తల్లిని ఉద్దేశించి మోదీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. 'ఒక మహిమాన్వితమైన శతకం భగవంతుడి పాదాల చెంతకు చేరింది. అమ్మ జీవితం ఒక తపస్సులాంటిది. సన్యాసినిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు కొలువైనట్టు భావిస్తున్నా' అని భావోద్వేగానికి గురయ్యారు.
Narendra Modi
BJP

More Telugu News