Narendra Modi: మోదీకి సానుభూతిని తెలిపిన జగన్, చంద్రబాబు

Jagan and Chandrababu pays tributes to Modis mother
  • నిన్న అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన హీరాబెన్
  • ఈ కష్ట సమయంలో తమ ప్రార్థనలు మోదీ కుటుంబంతో ఉంటాయన్న జగన్
  • తల్లిని కోల్పోవడం ఎవరికైనా చాలా బాధాకరమన్న చంద్రబాబు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వందేళ్లు సంపూర్ణ జీవితాన్ని గడిపిన ఆమె అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె మృతి చెందారు. ఈ సందర్భంగా మోదీకి ప్రముఖులు సానుభూతిని తెలియజేస్తున్నారు.

మోదీగారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ కష్ట సమయంలో తమ ప్రార్థనలు మోదీ కుటుంబంతో ఉంటాయని చెప్పారు. హీరాబెన్ మోదీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతున్నానని ట్వీట్ చేశారు.

తల్లిని కోల్పోవడం ఎవరికైనా అత్యంత బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. మాతృమూర్తిని కోల్పోయిన ప్రధాని మోదీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. మోదీ కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. హీరాబెన్ మోదీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Narendra Modi
BJP
Mother
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News