SUV: వచ్చే ఏడాది భారత్ లో కొత్త ఎస్ యూవీల విడుదల

More SUV models to be released in India next year
  • రెండు మోడళ్లతో వస్తున్న మహీంద్రా
  • సరికొత్త మోడల్ ను పరిచయం చేయనున్న మారుతి
  • జిమ్నీ పేరిట ఎస్ యూవీ
  • సెల్టోస్, క్రెటా, హెక్టర్ లకు కొత్త రూపు
ఎస్ యూవీ వాహనాలపై భారతీయుల్లో భారీ క్రేజ్ ఉంది. ఎస్ యూవీలు విశాలంగా ఉండడం, హై గ్రౌండ్ క్లియరెన్స్, దృఢమైన బాడీ, లుక్స్ వంటి కారణాలతో దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందుతున్నాయి. త్వరలో భారత మార్కెట్లోకి కొత్త ఎస్ యూవీ వాహనాలు విడుదల కానున్నాయి. 

మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ, మహీంద్రా థార్ 5 డోర్, ఫోర్స్ గూర్ఖా 5 డోర్, మారుతి జిమ్నీ 5 డోర్, కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్, హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్, ఎంజీ హెక్టర్ ఫేస్ లిఫ్ట్, టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ వాహనాలు ఎస్ యూవీ సెగ్మెంట్లో సందడి చేయనున్నాయి. 

వీటిలో మహీంద్రా రెండు మోడళ్లను తీసుకువస్తుండగా, మారుతి సంస్థ జిమ్నీ పేరిట సరికొత్త మోడల్ ను ప్రవేశపెడుతోంది. ఇవన్నీ రూ.15 లక్షల లోపు ధరతో వస్తున్నాయి. వీటిలో కొన్ని కొత్త మోడళ్లు కాగా, కొన్ని అప్ డేటెడ్ వెర్షన్లు. ఇవి 2023లో భారత రోడ్లపై పరుగులు తీయనున్నాయి.
SUV
Cars
Models
India

More Telugu News