'బేషరమ్' పాటలో మార్పులు చేయాలన్న సెన్సార్ బోర్డు

  • షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణే జంటగా పఠాన్
  • వివాదాస్పదమైన బేషరమ్ పాట
  • కాషాయరంగు బికినీలో దీపిక
  • మార్పులు చేశాక చిత్రాన్ని తమకు చూపించాలన్న సెన్సార్ బోర్డు
షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణే నటించిన పఠాన్ చిత్రంలోని బేషరమ్ పాట వివాదాస్పదం కావడం తెలిసిందే. ఆ పాటలో దీపిక కాషాయ రంగులోని బికినీ ధరించడం, మోతాదుకు మించిన అంగాంగ ప్రదర్శన ఉండడం తదితర అంశాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం సెన్సార్ బోర్డు వరకు వెళ్లింది. 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) చైర్మన్ ప్రసూన్ జోషి దీనిపై స్పందించారు. సీబీఎఫ్ సీ మార్గదర్శకాలకు అనుగుణంగా పఠాన్ చిత్రాన్ని పరిశీలించామని, చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో పాటు, పాటల్లోని దృశ్యాలు కూడా మార్చాలని చిత్రబృందానికి స్పష్టం చేశామని వెల్లడించారు. మార్పులు చేసిన చిత్రాన్ని విడుదలకు ముందే తమకు సమర్పించాలని ఆదేశించినట్టు తెలిపారు. సృజనాత్మక వ్యక్తీకరణకు, సున్నితమైన అంశాలకు మధ్య ఉండే సమతూకాన్ని గుర్తించడంలో సెన్సార్ బోర్డు నిబద్ధతతో వ్యవహరిస్తుందని ప్రసూన జోషి వివరించారు. కాగా, పఠాన్ చిత్రం 2023 జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News

Pathan CBFC Sharukh Khan Deepika Padukone Besharam Rang Bollywood