CBI: దేశవ్యాప్తంగా 91 యూనివర్సిటీల్లో సీబీఐ సోదాలు

CBI searches in 91 universities
  • నకిలీ విదేశీ వైద్య సర్టిఫికెట్ల స్కాం
  • కేంద్ర ఆరోగ్య శాఖ ఫిర్యాదు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దేశవ్యాప్తంగా 91 యూనివర్సిటీల్లో సోదాలు నిర్వహించింది. నకిలీ విదేశీ వైద్య సర్టిఫికెట్ల కేసులో ఈ సోదాలు చేపట్టింది. 

కేంద్రం నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో 73 మంది ఫెయిలయ్యారు. అయితే, స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు పొందుపరిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఫిర్యాదు నేపథ్యంలో, ఈ నెల 21న సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులను, ఏపీకి చెందిన ఇద్దరిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది. 

దర్యాప్తులో భాగంగా, ఈ నెల 23న సీబీఐ విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్ లోనూ తనిఖీలు జరిపింది. విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన విద్యార్థుల వివరాలు సేకరించింది. 2011 నుంచి నమోదైన వివరాలను సీబీఐ సేకరించించింది. రిజిస్టర్లు, కంప్యూటర్లలోని డేటాను స్వాధీనం చేసుకుంది.
CBI
Fake Foreign Medical Certificates
Scam
Telangana
Andhra Pradesh

More Telugu News