Chandrababu: అన్ని పార్టీలు సభలు జరిపే చోటే మేమూ సభ ఏర్పాటు చేశాం: చంద్రబాబు

Chandrababu reacts to criticism on Kandukur incident
  • నిన్న కందుకూరులో చంద్రబాబు సభ
  • తొక్కిసలాట కారణంగా 8 మంది మృతి
  • బాధితుల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు
  • ఇరుకు రోడ్లలో సభ జరపాల్సిన అవసరం తమకు లేదని వెల్లడి
కందుకూరు సభలో తొక్కిసలాట కారణంగా 8 మంది మృతి చెందిన విషాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున, నేతల తరఫున మొత్తమ్మీద రూ.25 లక్షల వరకు సాయం అందించే ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 

కాగా, కందుకూరు సభలో తొక్కిలాటపై తమపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు ఈ సందర్భంగా బదులిచ్చారు. ఇరుకు రోడ్లలో సభలు జరపాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇన్నేళ్లలో ఎన్నో సభలు పెట్టామని, అన్ని పార్టీలు సభలు జరిపే చోటే తాము కూడా సభ ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని విషయాలను తమపై విమర్శలు చేసిన వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నానని తెలిపారు.
Chandrababu
Kandukur
TDP
Rally

More Telugu News