31 st december: తెలంగాణాలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు రాత్రి ఎప్పటి వరకంటే..! తెలంగాణ ప్రభుత్వ తాజా ఉత్తర్వులు

wine shop will open till midnight on 31st December
  • డిసెంబర్ 31 న రాత్రి 1 గంట దాకా మద్యం అమ్మకాలు
  • వైన్ షాపులు అర్ధరాత్రి 12 వరకు.. బార్లు ఒంటి గంట వరకు తెరుచుకోవచ్చు
  • ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  
తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి మద్యం అమ్మకాలపై సడలింపులు ప్రకటించింది. రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. బార్లు, పబ్బులు, వైన్ షాపులు తెరిచి ఉంచే సమయాన్ని పొడిగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

రిటైల్ షాపుల్లో మద్యం అమ్మకాలకు ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు పర్మిషన్ ఉండగా.. దీనిని డిసెంబర్ 31న రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచే బార్లు డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు తెరచుకోవచ్చని చెప్పింది. కరోనా కాలంలో మద్యం అమ్మకాలను నిలిపేయడంతో నష్టపోయిన వ్యాపారులకు వెసులుబాటు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లైసెన్స్ పొందిన షాపు యజమానులు, బార్ నిర్వాహకులకు ఈ మినహాయింపులు వర్తిస్తాయని పేర్కొంది.
31 st december
wines
new year eve
wines sales
bars
Telangana

More Telugu News