Chinese woman: బుద్ధగయకు దలైలామా.. చైనా మహిళా గూఢచారి కోసం భద్రతా బలగాల వేట

  • నేటి నుంచి దలైలామా మూడు రోజుల పాటు పర్యటన
  • ఆయనకు చైనా మహిళ హాని తలపెడుతుందన్న అనుమానం
  • సదరు మహిళ ఊహాచిత్రం విడుదల
Sketch of Chinese woman suspected of spying on Dalai Lama released security alert sounded

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఓ చైనా మహిళ హాని తలపెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంగ్ షియాలోన్ అనే చైనీ మహిళకు సంబంధించి పోలీసులు ఓ ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. ఆమె పాస్ పోర్ట్, వీసా వివరాలను మీడియాకు విడుదల చేశారు. 

బీహార్ లోని గయకు సమీపంలో ఉన్న బుద్ధగయలో, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ను దలైలామా గురువారం ఉదయం సందర్శించారు. ఇక్కడ మూడు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. దలైలామా పర్యటన నేపథ్యంలో మహాబోధి టెంపుల్ కు వస్తున్న భక్తులను పోలీసులు క్షుణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. గయ సీనియర్ ఎస్పీ హర్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. చైనా మహిళకు సంబంధించి గత రెండేళ్లుగా తమకు సమాచారం ఉందని చెప్పారు. అయినప్పటికీ, మహిళను ఇప్పటికీ గుర్తించలేకపోయినట్టు తెలిపారు. సదరు మహిళ గయలో నివసిస్తున్నట్టు సమాచారం ఉందని, చైనా గూఢచారిగా అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News