Narendra Modi: చంద్రబాబు సభలో దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిన ప్రధాని

  • కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి
  • ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందానన్న ప్రధాని
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటన
Pained by the mishap at a public meeting in Kandukuru says Modi

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. సభకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన వల్ల తీవ్రంగా కలత చెందానని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని... గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు.

More Telugu News