Raja Singh: న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవద్దు: రాజాసింగ్

BJP Suspended MLA Raja Singh Urge People not to Celebrate new year

  • నూతన సంవత్సర వేడుకలు భారతీయ సంస్కృతికి విరుద్ధమన్న రాజాసింగ్
  • అది పాశ్చాత్యుల విధానమన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే
  • యువత తమ సంస్కృతీసంప్రదాయాలను తెలుసుకోవాలని సూచన

మరో మూడు రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని అందులో ఆయన కోరారు. భారతీయులది కాని వేడుకలు జరుపుకోవద్దన్నారు. యువత తమ సంస్కృతీసంప్రదాయాల గురించి తెలుసుకోవాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం మంచి పద్ధతి కాదని, దేశాన్ని 200 సంవత్సరాలపాటు పాలించిన వారి సంస్కృతి అది అని గుర్తు చేశారు. 

కాగా, మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన రాజాసింగ్ ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. రాజాసింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. తాజాగా, ఆయన ఈ వీడియో విడుదల చేసి మరోమారు వార్తల్లోకి ఎక్కారు.

Raja Singh
Hyderabad
Goshamahal
New Year Celebrations
  • Loading...

More Telugu News