Atchannaidu: లోకేశ్ పాదయాత్రలో ముద్దులు పెట్టుకోవడం ఉండదు: అచ్చెన్నాయుడు

No kissings will be in Nara Lokesh pada yatra says Atchannaidu
  • జగన్ పాదయాత్ర మాదిరి ఆడంబరంగా ఉండదన్న అచ్చెన్న
  • యువతకు అండగా ఉండేందుకే పాదయాత్ర అని వ్యాఖ్య
  • యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడేలా ప్రభుత్వ పాలన ఉందని విమర్శ
నారా లోకేశ్ చేపట్టే యువగళం పాదయాత్రలో ముద్దులు పెట్టుకోవడం, షాంపూలతో తల రుద్దడం వంటివి ఉండవని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పాదయాత్ర తరహలో లోకేశ్ పాదయాత్ర ఆడంబరంగా ఉండదని చెప్పారు. యువతకు అండగా ఉండేందుకే లోకేశ్ పాదయాత్ర అని అన్నారు. 

రాష్ట్రంలో మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని... యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావడం లేదని.. ఉన్న సంస్థలే వెళ్లిపోతున్నాయని చెప్పారు. యువతకు ఉపాధి ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విపక్షంలో ఉన్నాం కాబట్టి ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వలేమని అన్నారు. 9686296862కి మిస్డ్ కాల్ ఇచ్చి యువగళం పాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Atchannaidu
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Pada Yatra

More Telugu News