Chalapathi Rao: ముగిసిన సినీ నటుడు చలపతిరావు అంత్యక్రియలు

  • జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • అంతిమ సంస్కారాలను నిర్వహించిన కుమారుడు రవిబాబు
  • హాజరైన సురేశ్ బాబు, మంచు మనోజ్ తదితర ప్రముఖులు
Actor Chalapathi Rao funerals ends

సీనీయర్ సినీ నటుడు చలపతిరావు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. చలపతిరావు కుమారుడు రవిబాబు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నిర్మాతలు సురేశ్ బాబు, దామోదర ప్రసాద్, దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీవాస్, హీరో మంచు మనోజ్, నటుడు గౌతమ్ రాజు, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితర ప్రముఖులు హాజరయ్యారు. 

ఈ నెల 24న చలపతిరావు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉండటంతో వారి రాక ఆలస్యమయింది. దీంతో ఆయన భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచారు. ఈ ఉదయం 9 గంటల సమయంలో అంత్యక్రియలను నిర్వహించారు. 1,200కు పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

More Telugu News