Jagan: కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్

Jagan to meet Modi today
  • నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న జగన్
  • మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానితో భేటీ
  • రాష్ట్రానికి రావాల్సిన వాటిపై చర్చించనున్న ముఖ్యమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా పెండింగ్ బకాయిలు, ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం నిధులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. 

మరోవైపు జగన్ తో పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. ఇదిలావుంచితే, ఈ నెల మొదటి వారంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశానికి జగన్ హాజరైన సంగతి తెలిసిందే.
Jagan
YSRCP
Narendra Modi
BJP

More Telugu News