Chandrababu: కైకాల, చలపతిరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu visits Kaikala and Chalapathirao family members
  • ఇటీవల కన్నుమూసిన కైకాల సత్యనారాయణ, చలపతిరావు
  • కైకాల, చలపతిరావు నివాసాలకు వెళ్లిన చంద్రబాబు
  • వారి చిత్రపటాలకు నివాళులు
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు ఈ సాయంత్రం హైదరాబాదులో కైకాల నివాసానికి వెళ్లారు. ఆ నవరస నటనా సార్వభౌముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కైకాల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 

అటు, ఇటీవల మృతి చెందిన మరో సీనియర్ నటుడు చలపతిరావు కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించారు. చలపతిరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. చలపతిరావు కుమారుడు రవిబాబుతో మాట్లాడారు.
Chandrababu
Kaikala Sathyanarayana
Chalapathirao
Demis
Homage
Hyderabad
TDP
Tollywood

More Telugu News