Prabhas: ప్రభాస్ - సుకుమార్ కాంబోపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు!

  • 'పుష్ప 2'ను రూపొందిస్తున్న సుకుమార్ 
  • 'ప్రాజెక్టు K పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ 
  • ఇద్దరి కాంబోలో సినిమా అంటూ టాక్ 
  • అదంతా పుకారేనని తేల్చిన నిర్మాతలు  
 Abhishek Agarwal Arts gave a clarity on Prabhas movie

ప్రస్తుతం సుకుమార్ 'పుష్ప 2' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత సినిమా ప్రభాస్ తో ఉండొచ్చనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నట్టుగా కొత్త ప్రచారం ఊపందుకుంది. 

ఈ నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటనను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రభాస్ - సుకుమార్ కాంబినేషన్ లో తాము ఒక సినిమా చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఇది కేవలం పుకారు మాత్రమేననే విషయాన్ని స్పష్టం చేశారు. 

తమ బ్యానర్ నుంచి ఎప్పటికప్పుడు మంచి చిత్రాలను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటామనీ, ఆ విషయాలను అధికారికంగా తాము తెలియజేస్తూ ఉంటామని అన్నారు. పుకార్లను నమ్మొద్దని చెప్పారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్టు K' పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News