Vaikunta Dwara Darshanam: తిరుమలలో జనవరి 2 నుంచి వైకుంఠద్వార దర్శనం... 1వ తేదీ నుంచి టోకెన్ల జారీ

  • జనవరి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం
  • జనవరి 1 నుంచి టోకెన్ల జారీ
  • ఆఫ్ లైన్ లో టోకెన్లు
  • తిరుపతిలో 9 చోట్ల టోకెన్ల జారీ
Tirumala Vaikunta Dwara Darshanam tokens will be issued from January 1st

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతిలో జనవరి 1వ తేదీ నుంచి 9 చోట్ల టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 50 వేల చొప్పున 10 రోజుల పాటు 5 లక్షల టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. 10 రోజుల కోటా పూర్తయ్యేవరకు ఆఫ్ లైన్ విధానంలో నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయనున్నారు. 

తిరుపతిలోని శ్రీనివాసం, తుడా ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ సత్రాలు, శేషాద్రినగర్ జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ జడ్పీ హైస్కూల్ లో టోకెన్లు జారీ చేయనున్నారు.

More Telugu News