kajol: తల్లికి సర్ ప్రైజ్ గిఫ్టిచ్చిన బాలీవుడ్ నటి కాజోల్.. వీడియో ఇదిగో

 Actress Kajol and her sister Tanishaa gift mother Tanuja lavish bungalow in Mumbai
  • చెల్లెలు తనీషాతో కలిసి కొత్త ఇల్లు కట్టించి ఇచ్చిన హీరోయిన్
  • లోనావాలలో 8 నెలల పాటు నిర్మాణం
  • ఈ విషయం తల్లికి చెప్పకుండా దాచిన అక్కాచెల్లెళ్లు
  • ఇన్ స్టాలో ఈ వీడియో పోస్ట్ చేసిన తనీషా ముఖర్జీ
క్రిస్మస్ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తన తల్లికి మరిచిపోలేని బహుమతిని అందించింది. చెల్లెలు తనీషా ముఖర్జీతో కలిసి ముంబై సమీపంలోని లోనావాలా హిల్ స్టేషన్ లో విలాసవంతమైన ఇల్లు కట్టించి ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి దాదాపు 8 నెలలు పట్టిందని, అప్పటి వరకూ తల్లికి విషయం తెలియనివ్వలేదని చెప్పింది. ఆదివారం తల్లితో రిబ్బన్ కట్ చేయించిన ఈ అక్కాచెల్లెళ్లు.. తల్లితో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తనీషా ముఖర్జీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

వీడియో చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మీ ముగ్గురి మధ్య మంచి అనుబంధం ఉందని, దానిని అలాగే కొనసాగించాలని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కొత్త ఇంటి కల నిజమైనందుకు శుభాకాంక్షలు అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ ను కాజోల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ, సొంతంగా బ్యానర్ ఏర్పాటు చేసి పలు సినిమాలు నిర్మిస్తూ కాజోల్ బిజీగా గడుపుతోంది. తాజాగా  సలాం వెంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

https://www.instagram.com/reel/CmbXuhnJA-v/?utm_source=ig_web_button_share_sheet
kajol
tanisha mukerji
tanuja
mumbai
actress kajol
surprise gift to mother

More Telugu News