Srihan: నేనంటే ఇష్టంలేనివారే అలా అనుకుంటారు: శ్రీహాన్

Srihan Interview
  • బిగ్ బాస్ లో సెకండ్ పొజిషన్ లో నిలిచిన శ్రీహాన్ 
  • తన ఆటతీరుపై తనకి నమ్మకం ఉందని వ్యాఖ్య 
  • తాను .. సిరి అలా ఆలోచించలేదని వెల్లడి
  • తనని ఇష్టపడేవారు విన్నర్ గానే భావిస్తారని వివరణ  
బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్ టాప్ 2 పొజిషన్లో నిలిచాడు. 40 లక్షల సూట్ కేస్ తీసుకోవడం వలన, ఆయన రన్నర్ గానే ఉండిపోయాడు. నిజానికి ఆయనకే రేవంత్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని స్టేజ్ పై నాగార్జున చెప్పారు. దాంతో శ్రీహాన్ రన్నరా? విన్నారా? అనేది ఆడియన్స్ కి అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది. 

తాజా ఇంటర్వ్యూలో శ్రీహాన్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఫైనల్స్ లో స్టేజ్ పై నేను .. రేవంత్ ఉండాలనే కోరుకున్నాను. రేవంత్ కి ఆల్రెడీ సింగర్ గా మంచి క్రేజ్ ఉంది. అందువలన ఆయనకి ఓట్లు ఎక్కువ వస్తాయని నేను అనుకున్నాను. కాకపోతే నా ఆటతీరుపై ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ మాత్రం ఉంది " అన్నాడు. 

"నాకే ఓట్లు ఎక్కువగా వచ్చాయని బిగ్ బాస్ ఎప్పుడైతే రివీల్ చేశారో, అప్పుడు మాత్రం ఇక చాలు అనిపించింది. నేనంటే ఇష్టం ఉన్నవారు విన్నర్ అనుకుంటారు .. ఇష్టం లేని వారు రన్నర్ అనుకుంటారు. నేను - సిరి ఒకే సమయంలో బిగ్ బాస్ హౌస్ కి వెళ్లుంటే బాగుండేదని చాలామంది అన్నారు. కానీ అలాంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఎవరి ఐడెంటిటీ వారికి ఉండాలనేది మా అభిప్రాయం" అని చెప్పుకొచ్చాడు.
Srihan
Revanth
Sri Sathya
Bigg Boss

More Telugu News