ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తల్లి కన్నుమూత
- హైదరాబాద్ లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన థెరీసమ్మ
- 85 ఏళ్ల థెరీసమ్మ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు
- ఈ సాయంత్రం మార్కాపురంలో అంత్యక్రియలు
కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జి విద్యా సంస్థలకు ఆమె ఛైర్ పర్సన్ గా కూడా ఉన్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు తన తల్లి మృతి నేపథ్యంలో ఆదిమూలపు సురేశ్ కు పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.