Chalapathi Rao: విదేశాల్లో ఉన్న చలపతిరావు కుమార్తెలు.. బుధవారం అంత్యక్రియలు

  • గుండెపోటుతో మృతి చెందిన చలపతిరావు
  • అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు
  • నివాళి అర్పిస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Actor Chalapathi Rao funerals on wednesday

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు కన్ను మూశారు. కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులు కూడా కాకముందే చలపతిరావు కన్నుమూయడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఈ తెల్లవారుజామున తన కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు నివాసంలో ఆయన మృతి చెందారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉంటున్నారు. వారు వచ్చేంత వరకు భౌతికకాయాన్ని ఉంచనున్నారు. 

అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు నివాసంలోనే ఉంచనున్నారు. మధ్నాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచుతారు. బుధవారంనాడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు చలపతిరావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

More Telugu News