Chiranjeevi: సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా: చిరంజీవి

Want to give back to society says Chiranjeevi
  • ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి? అని ఆలోచించానన్న మెగాస్టార్
  • కోరుకున్న దానికంటే భగవంతుడు ఎక్కువే ఇచ్చాడని వ్యాఖ్య
  • సమాజానికి ఇవ్వాల్సింది చాలా ఉందన్న చిరు
స్టార్ డమ్ కంటే వ్యక్తిగత జీవితమే ముఖ్యమని సినీ నటుడు చిరంజీవి అన్నారు. దీనికి తగ్గట్టుగానే తన జీవితాన్ని మలుచుకునేందుకు ప్రతి రోజు యత్నిస్తుంటానని చెప్పారు. ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి? అని ఆలోచించానని... అది ఇక చాలు అని అన్నారు. 

ఇప్పుడు తన కుటుంబసభ్యులందరూ అత్యున్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. తాను కోరుకున్నదాకంటే భగవంతుడు ఎక్కువే ఇచ్చాడని... ఇకపై తాను సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. సమాజానికి ఇప్పటి వరకు తాను ఇచ్చింది చాలా తక్కువని... ఇవ్వాల్సింది చాలా ఉందని చెప్పారు. గ్లామర్, కీర్తి శాశ్వతం కాదని, మన వ్యక్తిత్వమే శాశ్వతమనే విషయాన్ని నమ్ముతానని అన్నారు.
Chiranjeevi
Tollywood

More Telugu News