Chiranjeevi: వర్ధంతి సందర్భంగా తండ్రిని స్మరించుకున్న చిరంజీవి

Chiranjeevi remembers his father
  • సోదర, సోదరీమణులతో కలిసి నివాళి
  • తండ్రిని స్మరించుకుంటున్నామని ట్వీట్
  • క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పెంచారని వివరణ 
తన తండ్రి వర్ధంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. తన తండ్రికి తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు, తన సోదరీమణులతో కలిసి ఆయన నివాళి అర్పించారు. 

తమ జీవిత విజయాలకు బాటను ఏర్పరిచారని భావోద్వేగానికి గురయ్యారు. 'మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పెంచి, మా కృషిలో ఎప్పుడూ తోడుగా ఉండి, మా విజయాలకు బాటనేర్పరచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్భంగా స్మరించుకుంటున్నాము' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు.
Chiranjeevi
Tollywood

More Telugu News