bomb cyclone: బాంబ్ సైక్లోన్ ధాటికి మంచు ముద్దలా మారిన అమెరికా!

US bomb cyclone New York under state of emergency millions trapped as temp dips to minus 45 C
  • 60 శాతం ప్రజలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం
  • విద్యుత్ సరఫరాకు అంతరాయం
  • మైనస్ 45 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • న్యూయార్క్ లో అత్యవసర పరిస్థితి
అమెరికా వ్యాప్తంగా చాలా ప్రాంతాలు వణికిపోతున్నాయి. సెలవుల సీజన్ లో ప్రజలు ఇళ్లల్లోనే బందీ కావాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. బాంబ్ సైక్లోన్ (శక్తిమంతమైన తుపాను) కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలుగా మోంటానా రాష్ట్రంలో శుక్రవారం నమోదయ్యాయి. అంతేకాదు, అమెరికా వ్యాప్తంగా అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 14 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలపై తుపాను ప్రభావం పడింది. న్యూయార్క్ లో అత్యవసర పరిస్థితి విధించారు. 

తూర్పు ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బలమైన గాలులకు వృక్షాలు, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. డెస్ మోయినెస్, లోవాలో ఉష్ణోగ్రతలు మైనస్ 38 డిగ్రీల సెంటీగ్రేడ్ గా నమోదయ్యాయి. అంటే ఇక్కడి ఉష్ణోగ్రతలో ఐదు నిమిషాలు ఉంటే గడ్డకట్టిపోవడం ఖాయం. నార్త్ కరోలినా, వర్జీనియా, టెనెస్సే ప్రాంతాలపైనా దీని ప్రభావం గణనీయంగా ఉంది. తుపాను కారణంగా 13 మంది మరణించారు. రోడ్లు దెబ్బతిన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. 20 కోట్ల మంది ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

bomb cyclone
usa
New York
emergency
minus 45°C

More Telugu News