Sajjala Ramakrishna Reddy: బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు: సజ్జల

Chandrababu trying to move close to BJP says Sajjala Ramakrishna Reddy
  • ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి తెలంగాణ యాత్రలను చంద్రబాబు ప్రారంభించారు
  • బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు
  • పల్నాడులో వైసీపీ బలంగా ఉంది
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టే చంద్రబాబు తెలంగాణ యాత్రలను ప్రారంభించారని చెప్పారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతన్ని గతంలోనే ప్రజలు తిరస్కరించారని అన్నారు. చంద్రబాబుకు ఏ విషయంలో కూడా క్లారిటీ లేదని చెప్పారు. 

బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని సజ్జల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా పనికట్టుకుని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పల్నాడులో వైసీపీ బలంగా ఉందని చెప్పారు. విద్యా రంగంలో డిజిటల్ విప్లవానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు.
Sajjala Ramakrishna Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News