Uttar Pradesh: చిక్కుల్లో అలనాటి నటి జయప్రద.. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  • 2019 లోక్ సభ ఎన్నికల్లో యూపీలో జయప్రదపై రెండు కేసులు
  • విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేసిన రాంపూర్ కోర్ట్  
  • రాంపూర్ లోక్ సభ ఎన్నికలో ఓడిపోయిన జయప్రద
ex mp jaya prada recieves non bailable warrant

అలనాటి నటి, మాజీ ఎంపీ జయప్రద చిక్కుల్లో పడ్డారు. బీజేపీ నాయకురాలైన జయప్రదపై ఉత్తరప్రదేశ్ రాంపూర్ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించినందుకు ఆమెపై వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. కేసు విచారణ సమయంలో ఆమె కోర్టుకు హాజరుకాలేకపోయారు. దాంతో, కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. 

వచ్చే మంగళవారం విచారణకు ఆమెను కోర్టులో హాజరు పరచాలని రాంపూర్ ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు జయప్రదకు వారెంట్ జారీ అయినట్టు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కాగా, ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన జయప్రద సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ చేతిలో పరాజయం చెందారు.

More Telugu News