imd: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు

  • తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు
  • ఈశాన్య గాలులతో ఏపీలో పెరగనున్న చలి తీవ్రత
Rain Alert Forecast For Andhra Pradesh next 3 Days

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా మారిందని తెలిపారు. 

ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పై ఈ ద్రోణి ప్రభావం నామమాత్రంగా ఉంటుందని వెల్లడించింది. 

ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఈశాన్య గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో చలి ప్రభావం పెరుగుతుందని, రాష్ట్రమంతటా దట్టమైన పొగమంచు అలముకుంటుందని వివరించారు.

More Telugu News