Sreeleela: రవితేజతో కలిసి యాక్ట్ చేయడానికి చాలా టెన్షన్ పడ్డాను: శ్రీలీల

Sreeleela Interview
  • శ్రీలీలకి వరుసగా వచ్చిపడుతున్న అవకాశాలు 
  • ఈ నెల 23న వస్తున్న 'ధమాకా'
  • తాను రవితేజ అభిమానినంటూ వ్యాఖ్య 
  • తన పాత్ర వెంటనే కనెక్ట్ అవుతుందని వెల్లడి
శ్రీలీల .. ఇప్పుడు కుర్రకారు నోళ్లలో ఎక్కువగా నానుతున్న పేరు. 'పెళ్లి సందD' సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ, 'ధమాకా' సినిమాతో ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తను చాలా బిజీగా ఉంది. 

తాజా ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ .. 'మొదటి సినిమా రాఘవేంద్రరావుగారి డైరెక్షన్లో అనేసరికి చాలా టెన్షన్ పడ్డాను. అలాగే రవితేజగారి జోడిగా చేయాలనే సరికి అంతే టెన్షన్ పడ్డాను. ఆయన నా ఫేవరేట్ హీరో. అలాంటి ఆయన సరసన ఇంత త్వరగా ఛాన్స్ రావడం నాకు చాలా ఆనందాన్నీ .. ఆశ్చర్యాన్ని కలిగించింది" అని అంది. 

'హలో గురూ ప్రేమకోసమే' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం త్రినాథరావు గారు నన్ను అడిగారు. అయితే కొన్ని కారణాల వలన నేను ఆ పాత్రను చేయడం కుదరలేదు. ఆయన గుర్తుపెట్టుకుని మరీ ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది .. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది" అని చెప్పుకొచ్చింది.
Sreeleela
Raviteja
Trinatha Rao Nakkina
Dhamaka Movie

More Telugu News