మరోసారి ప్రయోగం చేస్తున్న రామ్ చరణ్!

  • శంకర్ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించబోతున్న చరణ్!
  • ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రకు నత్తి ఉండేలా డిజైన్ చేసిన శంకర్
  • గతంలో లవకుశలో ఎన్టీఆర్, లైగర్ లో విజయ్ చేసినవి నత్తి పాత్రలే    
ఇది వరకు కమర్షియల్ సినిమాలకే మొగ్గు చూపిన పెద్ద హీరోలు ఈ మధ్య కాలంలో ప్రయోగాలకు వెనుకాడటం లేదు. ఎక్కువగా ప్రయోగాత్మక కథలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. హీరోకి ఏదైనా శారీరక లోపం ఉండే సవాల్ తో కూడిన పాత్రలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. దర్శకులు కూడా ఒకప్పటిలా హీరో అంటే ఇలానే ఉండాలని కాకుండా కథకు తగ్గట్టు నేచురల్ గా ఉండే పాత్రలను సృష్టించి మెప్పిస్తున్నారు. ఇప్పుడు హీరోకు ఏదో ఒక లోపం ఉన్న సినిమాలు ప్రేక్షకకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ‘రంగస్థలం’లో రామ్ చరణ్ వినికిడి లోపం ఉండే పాత్ర చేశారు. ఆ పాత్రలో అద్భుతంగా నటించి మంచి తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 ఇందులో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని టాలీవుడ్ లో ప్రచారం జరగుతోంది. తండ్రీకొడుకుల పాత్రలను చరణ్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్రకు నత్తి వుంటుందట. ఈ పాత్ర కోసం శంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని సమాచారం. అయితే, ఈ తరహా పాత్ర టాలీవుడ్ కు కొత్తేం కాదు. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ‘లైగర్’ లో, అంతకంటే ముందు ‘లవకుశ’లో ఎన్టీఆర్ చేశారు. లవకుశలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించారు. అందులో ఓ పాత్రకు నత్తి ఉంది. ఓవరాల్ గా ఆ సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొట్టగా, లైగర్ తో విజయ్ బోల్తా కొట్టాడు.  


More Telugu News

Ramcharan shankar movie Vijay Devarakonda liger