KTR: డ్రగ్స్ టెస్టులో క్లీన్ చిట్ తో బయటికి వస్తా... నీ చెప్పుతో నువ్వే కొట్టుకుంటావా?: బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్

KTR challenges Bandi Sanjay in drugs issue
  • కేటీఆర్ డ్రగ్స్ వాడతాడంటూ బండి సంజయ్ ఆరోపణలు
  • డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని వ్యాఖ్యలు 
  • నీకసలు తెలివి ఉందా? అంటూ బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్
కేటీఆర్ డ్రగ్స్ కు బానిస అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పదేపదే ఆరోపిస్తుండడం తెలిసిందే. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, డ్రగ్స్ కేసుతో కేటీఆర్ కు కూడా సంబంధం ఉందని బండి సంజయ్ అంటున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం... అందులో క్లీన్ చిట్ తో బయటికి వస్తా... మరి నాపై ఆరోపణలు చేసినవాడు కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటాడా? అంటూ బండి సంజయ్ పై ధ్వజమెత్తారు. నా చెప్పుతో కొడతానంటే అవమానపరిచాడంటూ తొక్కలో రాగాలు తీస్తారు... అందుకే ఆయన చెప్పుతో ఆయననే కొట్టుకోమని చెబుతున్నా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

" డ్రగ్స్ టెస్టు కోసం నా రక్తం తీస్తారో, చర్మం తీస్తారో... ఏం తీసుకుపోతారో తీసుకోండి. కావాలంటే నా బొచ్చు కూడా ఇస్తాను! నా చిత్తశుద్ధిని నిరూపించుకుని బయటికి వస్తా. తన చెప్పుతో తానే కరీంనగర్ కమాన్ వద్ద కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు... నేను ఇక్కడే ఉంటా... ఏ డాక్టర్ ను తీసుకువస్తాడో, ఏ గుండు కొట్టే ఆయనను తీసుకొస్తాడో తీసుకురమ్మనండి. నా బొచ్చు ఇస్తా, నా రక్తం ఇస్తా, నా చర్మం, ఇస్తా, నా గోర్లు ఇస్తా... వాని బొంద... ఏం కావాలో అన్నీ ఇస్తా. కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా! నీ పిండాకూడు... ఏం రాజకీయం అయ్యా ఇది! వానికేమైనా తెలివి ఉందా అసలు... మనిషా, పశువా? కరీంనగర్ కు ఏం చేశావంటే చెప్పే పరిస్థితి లేదు. పిచ్చి అరుపులు, గావుకేకలు, పెడబొబ్బలు, హౌలా మాటలు తప్ప ఇంకేముండదు" అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
KTR
Bandi Sanjay
Drugs
BRS
BJP
Telangana

More Telugu News