Jagan: దర్శి ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

CM Jagan attends MLA Maddisetti Venugopal son wedding reception
  • ఇటీవల దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహం
  • రోహితతో రాజీవ్ మద్దిశెట్టి వివాహం
  • నేడు దర్శిలో రిసెప్షన్
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరిన ఆయన 11 గంటలకు దర్శి చేరుకున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడు రాజీవ్ వివాహ రిసెప్షన్ కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు రోహిత, రాజీవ్ లకు సీఎం శుభాకాంక్షలు తెలిపి, వారిని ఆశీర్వదించారు. ఈ వివాహ రిసెప్షన్ కు మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. 

కాగా, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి తిరుగు పయనమయ్యారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సాయంత్రం విజయవాడ ఏప్లస్ కన్వెన్షన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News