క్రిస్మస్ కు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు

This Week Movies releasing in Theatres
  • ధమాకా తో వస్తున్న రవితేజ, శ్రీలీల
  • నిఖిల్ సినిమా 18 పేజెస్ రిలీజ్ ఈ నెల 23న
  • నయనతార నటించిన కనెక్ట్ కూడా వచ్చేస్తోంది
అవతార్ 2 సినిమా విడుదల నేపథ్యంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాల రిలీజ్ వాయిదా పడింది. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. రిలీజ్ వాయిదా పడ్డ వాటిలో రవితేజ 'ధమాకా' సహా పలు టాప్ హీరోల సినిమాలు ఉన్నాయి. నయనతార  నటించిన ‘కనెక్ట్’ సినిమా డిసెంబర్ 22న, పృథ్వీ సుకుమారన్ ‘కాప’, కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వేద’ డిసెంబర్ 23న రిలీజ్ అవుతున్నాయి.

ధమాకా..
రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధమాకా చిత్రానికి త్రినాధరావు దర్శకత్వం వహించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కానుంది.

18 పేజెస్..
ఘన విజయం సాధించిన కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్ కొత్త సినిమా 18 పేజెస్. ఇందులో నిఖిల్ సరసన అనుపమ నటించారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఈ నెల 23న రిలీజ్ కానుంది.

లాఠీ..
విశాల్ హీరోగా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిన సినిమా లాఠీ.. ఈ నెల 22న రిలీజ్ కానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సునయన నటించారు. 

సర్కస్.. 
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, పూజాహెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సర్కస్.. ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
Go Back to Shorts
movies
theatres
christmas
new movies
dhamaka
circus

More Telugu News