మా అక్కయ్య అలా చనిపోయింది: అలీ

Ali Interview
  • పాప్యులర్ షోగా నిలిచిన 'ఆలీతో సరదాగా' 
  • 300కి పైగా ఎపిసోడ్స్ ను పూర్తిచేసుకున్న షో 
  • చివరి ఎపిసోడ్ గెస్టుగా మారిన అలీ
  • తన గురించిన విషయాల ప్రస్తావన 
కమెడియన్ గా అలీ సుదీర్ఘ కాలంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. బుల్లితెరపై యాంకర్ గా కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలా 'ఆలీతో సరదాగా' కార్యక్రమాన్ని ఆయన 300 ఎపిసోడ్స్ కి పైగా చేశాడు. ఇక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేయనున్నారు. ఈ నేపథ్యంలో అలీని సుమ ఇంటర్వ్యూ చేసింది. అలీ తన గురించిన విషయాలను ఈ ఎపిసోడ్ లో పంచుకున్నాడు. 

"మా అమ్మానాన్నలకు మేము ఏడుగురం సంతానం. నాకు ఇద్దరు అక్కయ్యలు .. ముగ్గురు చెల్లెళ్లు .. ఒక తమ్ముడు. ఇంతమందిని కూడా మా ఫాదర్ మిషన్ కుట్టి పోషించేవాడు. భరతనాట్యం .. కూచిపూడి డ్రెస్సులు కుట్టడంలో ఆయన ఫేమస్. ఆయన కుట్టిన బట్టలను నేను ఇస్త్రీ చేసేవాడిని. అప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులతో సినిమాలు చూసేవాడిని" అని అన్నాడు. 

'మా అక్కయ్య ఫాతిమా గర్భిణిగా ఉన్నప్పుడు, స్టౌపై పాలు కాచి ఆ గిన్నెను దింపుతూ ఉంటే చున్నీ అంటుకుంది. ఆ మంటలతో ఆమె అరుస్తూ బయటికి రాగానే అక్కడున్నవారు ఆమెపై  నీళ్లు పోశారు. ఆ ప్రమాదంలో మా అక్కయ్యతో పాటు కడుపులో బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. ఆమె పేరునే నా కూతురికి పెట్టడం జరిగింది. ఆ సంఘటన నుంచి మేమంతా కోలుకోవడానికి చాలా కాలం పట్టింది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Ali
Suma
Alitho Saradaga

More Telugu News