Mohan Babu: ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

  • పై స్థాయి అధికారుల్లో ఎక్కువ మంది ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారన్న మోహన్ బాబు
  • నేను నిజం చూశాను అని కింది స్థాయి వాళ్లు చెపితే ఉద్యోగం పోతుందని విమర్శ
  • ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెప్పగలనని వ్యాఖ్య
Mohan Babu sensational comments on IAS and IPS officers

సినీ నటుడు మోహన్ బాబు అంటే ముక్కుసూటి మనస్తత్వం కలవారనే విషయం అందరికీ తెలిసిందే. తన మనసులో ఉన్న మాటను ఎలాంటి సంకోచం లేకుండా బయటకు చెప్పడం ఆయన నైజం. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో చాలా మంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తుంటారని విమర్శించారు. 

కింది స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు, పోలీసులపై పై స్థాయిలో ఉన్న ఐపీఎస్ ల ఒత్తిడి ఉంటుందని మోహన్ బాబు చెప్పారు. 'సార్ ఇది నిజం, ఇది జరిగింది, నేను కళ్లా చూశాను, మీరు తప్పు చెప్పమంటున్నారు, నేను నిజం చూశాను' అని కింది స్థాయి వాళ్లు చెపితే అతని ఉద్యోగం పోతుందని అన్నారు. పై స్థాయి అధికారుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారని చెప్పారు. ఈ విషయాన్ని తాను బహిరంగంగా చెపుతానని అన్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కు తాను ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తానని, అయితే వ్యవస్థలో జరుగుతున్నది మాత్రం ఇదేనని చెప్పారు.

More Telugu News