Shahrukh Khan: ఈ సినిమాను మీ కూతురుతో కలిసి చూడండి: షారుఖ్ ఖాన్ కు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సవాల్

Madhya Pradesh assembly speaker comments on Shahrukh Khan and Deddpika Padukone move Pathaan
  • షారుఖ్, దీపికల కాంబినేషన్లో 'పఠాన్' మూవీ
  • జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
  • కాషాయ బికినీలో దీపిక నటించడంపై తీవ్ర విమర్శలు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకుణేల తాజా చిత్రం 'పఠాన్'పై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంపై బీజేపీ, హిందుత్వ వాదులు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి 'బేషరమ్' సాంగ్ చుట్టూ వివాదం తిరుగుతోంది. కాషాయ బికినీలో దీపిక చేసిన ఎక్స్ పోజింగ్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాయ్ కాట్ పఠాన్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అసభ్యకర దృశ్యాలను తొలగించకపోతే సినిమాను నిషేధిస్తామని ఇప్పటికే మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిత్రా వార్నింగ్ ఇచ్చారు.  

ఈ క్రమంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ స్పందించారు. షారుఖ్ ఖాన్ ఆయన కుమార్తెతో కలిసి ఈ సినిమా చూడాలని సవాల్ విసిరారు. కూతురితో కలిసి సినిమాను చూసినట్టు ప్రపంచానికి తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాలని అన్నారు. ఇలాంటి సినిమానే మహమ్మద్ ప్రవక్తపై తీయగలరా? అని ప్రశ్నించారు.
Shahrukh Khan
Deepika Padukone
Pathaan Movie
BJP

More Telugu News