ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత మెస్సీ భావోద్వేగ సందేశం
- కప్ కోసం ఎన్నో ఏళ్లుగా కలగన్నానని వెల్లడి
- తన ప్రయాణంలో మద్దతిచ్చిన అభిమానులకు
కృతజ్ఞతలు తెలిపిన మెస్సీ - తుదిపోరులో ఫ్రాన్స్ పై గెలిచిన అర్జెంటీనా
‘ప్రపంచ చాంపియన్స్! ఈ మాట అనిపించుకోవాలని నేను చాలా సార్లు కల కన్నాను. ఇప్పుడు ప్రపంచ చాంపియన్స్ అయ్యామంటే నేను నమ్మలేకపోతున్నాను. నా కుటుంబ సభ్యులకు, నన్ను ఆదరిస్తున్న వారందరికీ, మమ్మల్ని నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. అర్జెంటీనియన్లు ఐకమత్యంతో ఉన్నప్పుడు, అంతా కలిసి పోరాడినప్పుడు మనం అనుకున్నది సాధించగలమని మేం మరోసారి నిరూపించాము. ఈ విజయం వ్యక్తిత్వాలకు అతీతమైన మా జట్టు మొత్తానికి చెందుతుంది. ఇది మా అందరి, అర్జెంటీనా ప్రజలందరి కల. దాని కోసం పోరాడాం. అనుకున్నది సాధించాం’ అని మెస్సీ పేర్కొన్నాడు. ఫైనల్ ముగిసిన తర్వాత సహచర ఆటగాళ్లతో సంబరాలు చేసుకుంటూ, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ, ట్రోఫీ అందుకున్న ఫొటోలను షేర్ చేశాడు.