Narendra Modi: మీ అద్భుతమైన విజయంతో సంతోషిస్తున్నా: అర్జెంటీనాపై మోదీ ప్రశంసలు

Modi congratulates Argentina for  winning FIFA World Cup
  • ఫైనల్స్ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న మోదీ
  • అర్జెంటీనా విజయంతో భారతీయ మెస్సీ అభిమానులు సంతోషిస్తున్నార్న మోదీ
  • ఫ్రాన్స్ స్ఫూర్తిదాయకమైన ఆటతీరును కనపరిచిందని కితాబు
ఫుట్ బాల్ ప్రపంచకప్ ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. దాదాపు మూడున్నర దశాబ్దాల నిరీక్షణ తర్వాత సూపర్ స్టార్ మెస్సీ సేన అర్జెంటీనాకు ప్రపంచకప్ ను అందించింది. నిన్న రాత్రి అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో అర్జెంటీనా జయకేతనం ఎగురవేసింది. మరోవైపు ప్రపంచకప్ విజేత అర్జెంటీనా విజయంపై భారత ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. 

అర్జెంటీనా - ఫ్రాన్స్ ల మధ్య జరిగిన ఫైనల్స్ సమరం అత్యంత థ్రిల్లింగ్ మ్యాచ్ గా గుర్తుండిపోతుందని మోదీ అన్నారు. ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్స్ అర్జెంటీనాకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతంగా ఆడారని కితాబునిచ్చారు. ఈ విజయం పట్ల అర్జెంటీనా, మెస్సీని అభిమానించే లక్షలాది మంది భారతీయులు సంతోషిస్తున్నారని అన్నారు. ప్రపంచకప్ లో స్ఫూర్తిదాయకమైన ప్రతిభను కనపరిచిందంటూ రన్నరప్ ఫ్రాన్స్ పై మోదీ ప్రశంసలు కురిపించారు. ఫుట్ బాల్ ప్రియులను ఫ్రాన్స్ ఆటగాళ్లు ఉర్రూతలూగించారని ప్రశంసించారు.
Narendra Modi
Telugudesam
FIFA World CUP
Argentina
France

More Telugu News