Janasena: జనసేనలో చేరిన పలువురు వైసీపీ నేతలు

YCP leaders joins Janasena
  • మంగళగిరిలో కార్యక్రమం
  • పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికలు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిప జనసేనాని
  • నేడు సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
జనసేనాని పవన్ కల్యాణ్ నేడు సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. అంతకుముందు, మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన బొంతు రాజేశ్వరరావు, విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గురాన అయ్యలు, పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ చైర్మన్ కొమ్మూరి కొండలరావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ సర్కారుకు సలహాదారుగానూ వ్యవహరించారు. రాజేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరారు. కాగా, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
Janasena
YSRCP
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News