తెనాలిలో అర్ధరాత్రి అన్నా క్యాంటీన్‌కు నిప్పు

  • అర్ధరాత్రి నిప్పు పెట్టి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు
  • అటుగా వెళ్తున్న వారు చూసి మంటలు ఆర్పిన వైనం
  • అనంతరం పోలీసులకు సమాచారం
ఏపీలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మూసివేసింది. మరింత మెరుగ్గా వాటిని నిర్వహిస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో అన్నా క్యాంటీన్లు అన్నీ మూతపడ్డాయి. అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలంటూ ప్రతిపక్ష నేతలు పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. 

తాజాగా, గుంటూరు జిల్లా తెనాలిలో అలా మూతపడిన అన్నా క్యాంటీన్‌కు గత రాత్రి కొందరు దుండగులు నిప్పు పెట్టి కాల్చి బూడిద చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు.

Guntur District
Tenali
Anna Canteen
Fire Accident

More Telugu News