Julakanti Brahma Reddy: మాచర్లలో అల్లర్లకు వీరిద్దరే సూత్రధారులు: జూలకంటి బ్రహ్మారెడ్డి

Today also YSRCP workers attacked our offices says Brahma Reddy
  • పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, తురకా కిశోర్ లే కారణమన్న జూలకంటి 
  • తాము కరపత్రాలను పంచుతుంటే వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగారని విమర్శ 
  • ఈరోజు కూడా తమ కార్యాలయాలపై దాడి చేశారని ఆరోపణ 
మాచర్లలో చోటు చేసుకున్న అల్లర్లకు వైసీపీ అరాచకాలే కారణమని టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. అల్లర్లకు సూత్రధారులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, తురకా కిశోర్ లే నని ఆరోపించారు. మాచర్ల మెయిర్ రోడ్డుపై తాము కరపత్రాలను పంచుతుంటే వీరిద్దరి నేతృత్వంలో వైసీపీ వర్గాలు రెచ్చగొట్టే చర్యలకు దిగాయని మండిపడ్డారు. 

గంట ముందు నుంచే వైసీపీ శ్రేణులు అక్కడ మకాం వేసినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ దాడులను తాము ప్రతిఘటించిన తర్వాత పోలీసులు వచ్చి తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారని అన్నారు. ఈ రోజు కూడా తమ కార్యాలయాలపై దాడి చేశారని, కార్యాలయంలో నగదు ఎత్తుకుపోయారని చెప్పారు. మాచర్లలో జిల్లా ఎస్పీ ఉన్నప్పటికీ ఈ ఘటనలు కొనసాగుతుండటం దురదృష్టకరమని అన్నారు.
Julakanti Brahma Reddy
Telugudesam
Macherla

More Telugu News