retrieve money: యూపీఐ ద్వారా పొరపాటున వేరొకరికి బదిలీ చేశారా? అయితే, పరిష్కారం ఇదిగో..ఇలా..!

  • పేమెంట్ సిస్టమ్ అగ్రిగేటర్ వద్ద ఫిర్యాదు దాఖలు
  • ఆ తర్వాత ఎన్ పీసీఐ పోర్టల్ ఫైనా ఫిర్యాదుకు అవకాశం
  • చివరిగా బ్యాంకు, ఆ తర్వాత అంబుడ్స్ మన్
How to retrieve money if you transferred money to a wrong UPI ID from PhonePe Google Pay Paytm

నేడు దాదాపు స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరూ యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. నెలకు వందలాది కోట్ల లావాదేవీలు నమోదవుతున్నాయి. అయితే ఇలా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో పొరపాటున వేరే వ్యక్తికి నగదు బదిలీ చేస్తే ఎలా? అంటే.. దాన్ని రికవరీ చేసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి.

  • ఆర్ బీఐ నిబంధనల మేరకు ఇలా పొరపాటుగా నగదు బదిలీ చేసిన బాధిత వ్యక్తి, తాను ఉపయోగించిన పేమెంట్ సిస్టమ్ కు ఫిర్యాదు చేయాలి. 
  • ఉదాహరణకు పేటీఎం లేదా గూగుల్ పే లేదా ఫోన్ పే నుంచి పంపిస్తే ఆయా ప్లాట్ ఫామ్ కస్టమర్ కేర్ వద్ద కంప్లయింట్ ఫైల్ చేయాలి. పొరపాటుగా నగదు బదిలీ అయినట్టు పేర్కొని, రిఫండ్ కోసం అభ్యర్థన నమోదు చేయాలి.
  • బాధిత వ్యక్తి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) పోర్టల్ పైనా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. డిస్ప్యూట్ రిడ్రెస్సల్ మెకానిజం అనే ట్యాబ్ ను సెలక్ట్ చేయాలి. కంప్లయింట్ సెక్షన్ లో ఉండే ఆన్ లైన్ ఫామ్ ను ఫిల్ చేయాలి. యూపీఐ లావాదేవీ ఐడీ, వర్చువల్ పేమెంట్ అడ్రస్, బదిలీ చేసిన మొత్తం, లావాదేవీ తేదీ, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వాలి. దీనికి అదనంగా బ్యాంకు స్టేట్ మెంట్ కూడా జత చేయాలి. అందులో ఫిర్యాదు చేస్తున్న లావాదేవీ వివరాలు కూడా ఉండాలి. ‘ఇన్ కరెక్ట్ లీ ట్రాన్స్ ఫర్డ్ టు అనదర్ అకౌంట్’ ఆప్షన్ ను కారణంగా సెలక్ట్ చేయాలి.
  • అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకు వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. 
  • అయినా పరిష్కారం లభించకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ ను సంప్రదించొచ్చు.

More Telugu News