Pinnelli Ramakrishna Reddy: మాచర్ల హింస వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారు: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి

Chandrababu and Nara Lokesh are behind Macherla incident says Pinnelli
  • ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్లకు పంపి దాడులు చేయిస్తున్నారన్న పిన్నెల్లి 
  • జూలకంటి వచ్చిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయని ఆరోపణ
  • గొడవలతో రాజకీయ లబ్దిని పొందాలనుకుంటున్నారని మండిపాటు 
నిన్న జరిగిన అల్లర్లతో మాచర్ల ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీ జూలకంటి బ్రహ్మారెడ్డి నివాసం, పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. వైసీపీ శ్రేణులే ఈ పని చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ ఘటనలపై వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... ఈ అల్లర్ల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఉన్నారని చెప్పారు. ఒక ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్లకు పంపి దాడులు చేయిస్తున్నారని అన్నారు. 

బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత మాచర్లలో ఉద్రిక్తతలు పెరిగాయని చెప్పారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్దిని పొందాలనుకుంటున్నారని విమర్శించారు. పార్టీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేయాలనుకున్నవారు కర్రలు, రాడ్ లతో దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Pinnelli Ramakrishna Reddy
YSRCP
Chandrababu
Nara Lokesh
Julakanti
Telugudesam
Macherla

More Telugu News