auto helps benz: బెంజ్ కారును తోసుకెళ్లిన ఆటో.. వీడియో ఇదిగో!

  • నడి రోడ్డుపై ఆగిన కారును షెడ్డుదాకా నెట్టుకెళ్లిన ఆటో డ్రైవర్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఫన్నీగా కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు
Auto Driver Pushes Mercedes With His Leg

నడి రోడ్డు మీద కారు ఆగిపోతే మంచి మనసుతో సాయం చేశాడో ఆటో డ్రైవర్.. బైక్ ను మరో బైక్ తో తోసుకెళ్లినట్లు ఆ కారును షెడ్డు దాకా తోసుకెళ్లాడు. ఆటో నడుపుతూ ఓ కాలుతో బెంజ్ కారును నెడుతూ మెకానిక్ షెడ్డుకు చేర్చాడు. వారి వెనక ట్రాఫిక్ లో ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పూణెలోని కోరేగావ్ పార్క్ ఏరియాలోని ఓ బిజీ రోడ్డులో బెంజ్ కార్ బ్రేక్ డౌన్ అయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాలేదు. దగ్గర్లోని మెకానిక్ షెడ్డుకు కారును తరలించేందుకు సాయం కోసం చూశాడా డ్రైవర్.. అయితే, అందరూ తమ తమ పనులపై బిజీబిజీగా వెళ్తుండడంతో మెర్సిడెస్ కారు డ్రైవర్ అసహాయంగా ఉండిపోయాడు. ఇంతలో ఓ ఆటో వచ్చి కారు పక్కన ఆగింది. కారు పరిస్థితి చూసిన ఆటో డ్రైవర్.. సాయానికి ముందుకొచ్చాడు. బైక్ పై కూర్చుని మరో బైక్ ను తోసుకెళ్లినట్లు తన ఆటో నడుపుతూ కాలితో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాడు.

దగ్గర్లోని మెకానిక్ షెడ్డు దాకా కారును అలాగే తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆటో డ్రైవర్ మంచి మనసుకు ఫిదా అయ్యామని చెబుతున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. బెంజ్ కారు కొనేంత డబ్బు మీకుండొచ్చు కానీ అందులో పెట్రోల్ కొట్టించలేక ఇలా నడి రోడ్డుపైనే ఆగిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవల పెరిగిన పెట్రోల్ ధరలను ఉద్దేశించి ఇలా వ్యంగ్యంగా కామెంట్ చేశారా యూజర్.

More Telugu News