Twitter India: ట్విట్టర్ కు భారత్ లో మిగిలింది 80 మంది ఉద్యోగులే!

  • 250 మందికి గాను 170 మందిని తొలగించిన మస్క్
  • మిగిలిన వారిపై అధిక పనిభారం, అధిక వేళలు
  • సాయంత్రం స్నాక్స్ కు సైతం మంగళం
170 out Twitter left with around 80 employees in India engineers asked to work long hours

భారత్ లో ట్విట్టర్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. మొత్తం 250 మంది ఉద్యోగులకు గాను 170 మందికి గుడ్ బై చెప్పేసింది. దీంతో ట్విట్టర్ కు భారత్ లో కేవలం 80 మంది ఉద్యోగులే మిగిలారు. అంటే ఇప్పటి వరకు 250 మంది సంయుక్తంగా చేసిన పనిని.. ఇక మీదట కేవలం 80 మంది ఉద్యోగులే నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ వంటి వ్యాపారవేత్తల నయా శ్రమ దోపిడీకి ఇది నిదర్శనం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ, బెంగళూరు, ముంబై కార్యాలయాల పరిధిలో ఈ 80 మంది పనిచేస్తున్నారు. మిగిలిన ఈ కొద్ది మందే ఎక్కువ పనిభారాన్ని మోయాల్సిన పరిస్థితుల్లో ఏ కంపెనీ అయినా అదనపు ప్రయోజనాలు ఇస్తుంది. కానీ, ఇక్కడ సీన్ వేరు. ఇప్పటి వరకు ట్విట్టర్ ఉద్యోగులకు భారత్ లో స్నాక్స్ ఇస్తుండగా, మస్క్ వాటికి ముగింపు పలికారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత పని వాతావరణం పూర్తిగా మారిపోయినట్టు ఓ ఉద్యోగి వెల్లడించారు. అధిక పని వేళలతో పాటు, వారాంతాల్లోనూ పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నట్టు చెప్పారు.  

More Telugu News