Pawan Kalyan: వైసీపీ వారు అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించడం ఎంతైనా ప్రశంసనీయం: పవన్ కల్యాణ్ సెటైర్లు

Pawan kalyan satires on ys jagan
  • ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం చెప్పినట్టు వార్తలు
  • దీనిపై స్పందించిన జనసేన అధినేత
  • సీఎం జగన్ పై సెటైర్ వేసిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ఎన్నికలు దగ్గర పడ్డాయి.. మంత్రులందరూ  అవినీతికి దూరంగా ఉండాలంటూ సీఎం జగన్ చెప్పినట్టుగా వేసిన కార్టూన్ ను జనసేన పార్టీ ట్విట్టర్ లో షేర్ చేసింది. దీన్ని పవన్ రీట్వీట్ చేశారు. ‘వైసీపీ వారు తాము చేస్తున్న అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించడం ఎంతైనా ప్రశంసనీయం’ అని ఎద్దేవా చేశారు. 

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అవినీతికి దూరంగా ఉండాలని, ఎలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సీఎం జగన్‌ మంత్రులకు స్పష్టం చేసినట్లుగా కొన్ని వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా అవినీతిపై మంత్రులతో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన పవన్.. తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
Pawan Kalyan
YSRCP
YS Jagan
Andhra Pradesh
Janasena

More Telugu News